హైదరాబాద్: 28°C
తెలంగాణ

తరగతి దశ నుంచే నైపుణ్యాలు నేర్చుకోవాలి: కలెక్టర్

VKB: విద్యార్థి దశ నుంచే కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు సూచించారు. పట్టణంలోని KGBVలో 6, 7, 8 తరగతుల విద్యార్థినులకు లెర్నింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.