KMR: పెద్ద కొడఫ్గల్ మండలం కాస్లాబాద్‌లో చెరువు నిండి అలుగు పారుతుండటంతో కుబ్యా నాయక్ జీపీ పరిధిలోని దుబ్బ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు వేరే దారి లేక నడుములోతు నీళ్లలోంచే ప్రాణాలను పణంగా పెట్టి దాటుతున్నారు. వర్షాలు పడినప్పుడల్లా ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.
తెలంగాణ
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని 'బడి' బాట


