హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైపాస్ కాలనీలో ముంపు ప్రాంతం పరిశీలన

పార్వతీపురం పట్టణంలోని బైపాస్ కాలనీలో ముంపు ప్రాంతాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో కాలనీలో పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ హాస్టల్‌కు తక్షణ సహాయం అవసరమైతే తనను సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థులు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు.