హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ టేకు కలప పట్టివేత..!

BDK: దమ్మపేట రేంజ్‌ అంకంపాలెం బీట్‌లో అక్రమంగా నిల్వ చేసిన టేకు కలపను గురువారం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 57 టేకు రౌండ్‌ దుంగలు, 44 సాన్‌ సైజులతో మొత్తం 5.235 క్యూబిక్‌ మీటర్ల కలప పట్టుబడింది. దీని విలువ రూ.7.05 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.