NLG: చిట్యాల నాలుగవ వార్డుకు చెందిన యువకుడు చెరుపల్లి సాయి ఆకస్మికంగా మృతి చెందాడు. చిట్యాల భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం తరపున గురువారం నివాళులు అర్పించారు. పూలమాలవేసి, మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జెల్లా మనోహర్, ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం, చేపూరి శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
యువకుడు మృతి.. నివాళులు అర్పించిన భక్త మార్కండేయ సభ్యులు


