హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మణికంఠస్వామి ప్రత్యేక పూజలు

గద్వాల జిల్లా ఉండవల్లిలోని మణికంఠస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కుడు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామావళి, మంగళహారతి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులను ఆకట్టుకున్నారు.