NGKL: అచ్చంపేట పట్టణంలో శనివారం జరగాల్సిన గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కన్వీనర్ జక్క గోపాల్ తెలిపారు. పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. విగ్రహావిష్కరణకు నూతన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజా సంఘాల నాయకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
గద్దర్ విగ్రహావిష్కరణ వాయిదా


