హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాటిపూడి రిజర్వాయర్‌‌ను పరిశీలించిన కలెక్టర్

VZM: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ తాటిపూడి రిజర్వాయర్‌‌ను పరిశీలించారు. రిజర్వాయర్ నీటి హెచ్చు తగ్గులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తాటిపూడి రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.32.టి.ఎం.సిలు కాగా, ప్రస్తుతం 1.49 టీఎంసీల నీరు ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట గంట్యాడ తహసీల్దార్ సూర్యాకాంతం ఉన్నారు.