హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై

BHNG: రాజాపేటలోని కుమ్మరి కుంట, సకరికుంటలో వినాయక నిమజ్జన వేడుకల కోసం చేపట్టిన ఏర్పాట్లను అధికారులు, ఎస్సై తఖీయుద్దీన్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు, ఉపసర్పంచ్ నెమిల కేదారి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.