హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మల చెరువుకు గండి

SDPT: బెజ్జంకి మండలం రామసాగరం, దాచారం గ్రామాల పరిధిలోని తుమ్మలచెరువుకు గత రాత్రి కురిసిన వర్షానికి గండి పడింది. దీంతో దాచారం గ్రామానికి చెందిన ముదిరాజులు ఇటీవల చెరువులో పోసిన చేప పిల్లలు నీటిలో కొట్టుకుపోయాయి. చేప పిల్లలు కొట్టుకుపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లిందని ముదిరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తాత్కాలికంగా గండికి మరమ్మతులు చేపట్టారు.