హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏ లు అర్ద నగ్న ప్రదర్శన

కోనసీమ: ఆలమూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్‌లో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) నిరవధిక సమ్మె గురువారానికి 9వ రోజుకు చేరింది. మండల వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జోరువానలోనే శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న తరహాలో పే స్కేల్‌ అమలు చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.