హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పరిస్థితి పై కేంద్ర మంత్రి ఆరా

SKLM: జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. ఇవాళ కలెక్టర్, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలు, గాలుల తీవ్రత పై వివరాలు తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు, మత్స్యకారుల భద్రతకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.