హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ-విశాఖ ఇండిగో ఫ్లైట్ రద్దు

NTR: భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం (భోగాపురం) వెళ్లాల్సిన ఇండిగో 6E 7128 విమాన సర్వీసు రద్దయింది. ఈ విమానం ఇవాళ ఉదయం 9.20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరాల్సి ఉంది. వాతావరణం కారణంగానే సర్వీసును రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. కాగా, మిగిలిన అన్ని విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయని అన్నారు.