హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధురాలు దారుణ హత్య

SRD: పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కొత్తగాడి పోచమ్మ (75)ను  గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గుండ్లు, కమ్మలు, వెండి పట్టగొలుసులను ఎత్తుకెళ్లారు.సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.