SRD: జిల్లాలో మహబూబ్ సాగర్, ఊబా చెరువులలో నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. భక్తుల రక్షణ కోసం చెరువుల వద్ద బలమైన బారికేడ్లు, రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్రేన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. NDRF, గజ ఈతగాళ్లను నిరంతరం సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పటిష్ట భద్రతతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు


