హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

KMR: బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులు ఇప్పుడు తమ హక్కుల కోసం ఇవాళ రోడ్డెక్కారు. మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందంటూ కార్మికులు ధర్నాకు దిగారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.