హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా చేర్యాల దవాఖాన దారి

SDPT: చేర్యాల ప్రభుత్వ దవాఖానకు వెళ్లే దారి వర్షపు నీటితో బురదమయమై నరకాన్ని చూపిస్తోంది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలు వైద్య సేవల కోసం రోజూ ఇక్కడికి వస్తుంటారు అంబులెన్స్‌లు సైతం ఆసుపత్రికి వచ్చే దారి మూలంగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే దృష్టిసారించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.