NGKL: కల్వకుర్తి మండలం మార్చాల ప్రాథమిక పాఠశాలలో ఈరోజు వనమహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంఈఓ శంకర్ నాయక్ హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అప్పుడే భావితరాలకు ఆహ్లాదకరమైన, కాలుష్య రహిత వాతావరణాన్ని అందించగలమని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
మార్చాల ప్రాథమిక పాఠశాలలో వనమహోత్సవం


