BPT: ఈనెల 27న కర్లపాలెం శ్రీ భార్గవి హైస్కూల్‌లో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు హరిబాబు గురువారం తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అందులో పాల్గొంటారన్నారు. వారంతా ఉదయం 8 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కర్లపాలెంలో 27న జిల్లా స్థాయి చెకుముకి పోటీలు


