హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై వ్యక్తి ఆత్మహత్య

MNCL: ఆన్‌లైన్ గేమ్‌లకు మరో ప్రాణం బలైంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మేస్త్రి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9 లక్షలు పొగొట్టుకున్నాడు. చేసిన అప్పును తీర్చలేననే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి ఫోన్‌లో ఆన్‌లైన్ ఆటల వల్లే తాను చనిపోతున్నట్లు వాయిస్ రికార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.