హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మునిచంద్ర

CTR: చిత్తూరు డివిజన్‌కు వర్ష సూచన ఉండడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏ సమయంలో ఇబ్బంది వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. సకాలంలో ఫోన్‌లకు స్పందించి వినియోగదారులకు సమాధానం ఇవ్వాలన్నారు. విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంటే దానికి కారణాలను వినియోగదారులకు తెలియజేయాలన్నారు.