SKLM: బూర్జ (M) లక్కుపురం గ్రామంలోని పలు వీధుల్లోకి వరద నీరు చేరడంతో గ్రామం జలమయంగా మారింది. వీధులన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు తాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జలమయమైన లక్కుపురం గ్రామం


