హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం

WNP: కొత్తకోట మండలంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు పెరిగిపోయాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కోశాధికారి నిక్సన్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్టీసీ అధికారులను కలిసి సమస్యలను వివరించారు. నిత్యం వందకు పైగా బస్సులు రాకపోకలు సాగించే బస్టాండ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమస్యలను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.