ASF: కాగజ్ నగర్ మండలం నాగంపేటకు చెందిన అఫ్సానా బేగం అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1లక్ష LOCని MLA హరీష్ బాబు ఇవాళ అందజేశారు. MLA మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
CMRF ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం: MLA


