NTR: చందర్లపాడు మండలంలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రాత్రింబవళ్లు కురుస్తున్న వర్షంతో మండలంలోని పల్లెల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పంట పొలాల్లోకి కూడా వర్షపు నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చందర్లపాడు మండలాన్ని ముంచెత్తిన వర్షం


