హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్యూటీ మాటున లూటీ చేస్తున్న అధికారులు

WGL: రవాణా శాఖలో తనిఖీల పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 మంది ఎంవీఐలు, 21 మంది ఏఎంవీఐలు పన్నులు లేని వాహనాలపై కేసులు పెట్టకుండా లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము అధికారుల జేబుల్లోకి చేరుతోందని విమర్శలు వెలుబడుతున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.