హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

MDK: ఈనెల 27న పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మెదక్ ఖిల్లా, చర్చి, ఏడుపాయల, పోచారం, నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చారిత్రక సంపదను పరిరక్షిస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.