SRD: జోగిపేటలో వినాయక నిమజ్జన వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. ఆందోల్ పెద్ద చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ప్రమాదంలో ఆందోల్‌కి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే బాధితులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
నిమజ్జన వేడుకల్లో తప్పిన ప్రమాదం


