హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలతో రాకపోకలు బంద్

ASR: భారీ వర్షాలతో పాడేరు–చింతపల్లి ప్రధాన రహదారి మత్స్యపురం వద్ద డైవర్షన్ రోడ్డు కొంతమేర దెబ్బతింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పోలీసులు,రెవెన్యూ, హైవే సిబ్బంది రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గానికి మళ్లించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి సూచనలు వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.