WNP: మర్రికుంటలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరస్వతి తెలిపారు. ఎంపీసీలో 12, బైపీసీలో 2, సీఈసీలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలికలు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


