హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వర్షపు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు'

కృష్ణా: గుడివాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న పారిశుధ్య, డ్రైనేజీ పనులను ఇవాళ కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను సిబ్బందితో కలిసి తొలగిస్తూ, వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.