హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటింటా జ్వర సర్వే.. 4,144 మంది గుర్తింపు

ములుగు జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,52,415 ఇళ్లలో సర్వే చేసి 4,144 మంది జ్వర బాధితులను గుర్తించారు. 241 వైద్య శిబిరాల్లో 9,184 మందికి పరీక్షలు నిర్వహించగా 557 మందికి జ్వరం ఉన్నట్లు తేలింది. 206 మందికి డయేరియా, 273 మందికి శ్వాసకోశ వ్యాధులు, ఇద్దరికి మలేరియా గుర్తించారు.