హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 29న మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు

అనకాపల్లి జిల్లాలో 14 మత్స్యకార సొసైటీలకు వచ్చేనెల 6న ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారిణి విజయ ఇవాళ తెలిపారు. ఈనెల 29న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మత్స్యకారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.