WGL: రాయపర్తి మండలం సన్నూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దడిగెల నర్సమ్మకు చెందిన ఇల్లు గురువారం కూలిపోయింది. గోడలు, ఇంటి నిర్మాణం వర్షానికి తడిసి నేలమట్టమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని నర్సమ్మ కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ సాయం కోసం బాధితురాలి విజ్ఞప్తి


