HYD: హయత్‌నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 730 కిలోల పేస్ట్‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO: కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలకలం


