హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్‌గల్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: భీమ్‌గల్ మండలం పిప్రి (జె) గ్రామంలో ఏడుగురికి సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఏడుగురు లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.2.04 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌ కుమార్‌, సర్పంచ్‌ ఆరిగేలా జనార్దన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.