హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్ధరాత్రి భారీ చోరీ

SRD​: కంగ్టి మండలంలోని చాప్టా (కే) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సేరి నాగౌండ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.  2 తులాల బంగారం, 50 తులాల వెండి కడియాలు, రూ.25 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు తెలిపారు. SI దుర్గారెడ్డి ఇవాళ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసును వేగంగా దర్యాప్తుచేస్తామని తెలిపారు.