హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు నీటితో విద్యార్థులు ఇబ్బందులు.!

NRML: నిర్మల్ పట్టణంలోని YSR కాలనీలో మురుగు కాలువల దుస్ధితికి అద్దం పడుతోంది. సరైన మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాఠశాల చుట్టూ మురుగు నీరు చేరి దోమలు, దుర్వాసన వస్తుండడంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ  వహించలేకపోతున్నామని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.