హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల 27న చలో యాదగిరి గుట్ట'

PDPL: ఈనెల 27న తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనలో భాగంగా యాదగిరిగుట్టలో ఉద్యమకారుల సదస్సు నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల, సెంటినరీకాలనీలో బుధవారం ‘చలో యాదగిరిగుట్ట’ గోడపత్రికను ఆవిష్కరించారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.