హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వట్టివాగుకు భారీ ఇన్‌ఫ్లో.. రెండు గేట్లు ఎత్తివేత

ASF: ఆసిఫాబాద్‌లోని వట్టివాగు ప్రాజెక్టులో నీటిమట్టం 239.300 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 2.805 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 1,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, రెండు స్పిల్‌వే గేట్లను 0.3 మీటర్ల మేర ఎత్తి 1,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షం కొనసాగుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.