NLR: ఉదయగిరి బాలాజీ నగర్ ఎంట్రన్స్‌లోని పిండి మిల్లు సమీపంలో విద్యుత్ తీగలకు చెట్టును సపోర్టుగా ఏర్పాటు చేయడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు చెట్టుకు రాసుకోవడంతో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయని స్థానికులు తెలియజేశారు. ప్రమాదం జరగక ముందే విద్యుత్ అధికారులు స్పందించి, ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ తీగల రాపిడితో మంటలు..!


