హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు: MRO మంగ

SRPT: నడిగూడెం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్ స్తంభాలు, పాత గోడలు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. పాఠశాలలకు సెలవు ప్రకటించినందున పిల్లలను వినాయక నిమజ్జనం లేదా సరదా కోసం నీటి వనరుల వద్దకు వెళ్ళద్దని ఆమె కోరారు.