హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన హుండీ లెక్కింపు

SS: కదిరి పట్టణంలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమం గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేవస్థానం అధికారులు, సిబ్బంది సమక్షంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.