NGKL: స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుపై వంగూరు మండలం జాజాల సర్పంచ్ జిలకర కాశమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్‌లు చేసి మరీ సర్పంచ్‌లకు బిల్లులు చేయొద్దంటూ ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారని ఆరోపించారు. తన మెడలోని పుస్తెలు, మెట్టెలు తాకట్టు పెట్టి సొంత డబ్బులతో గ్రామంలో పనులు చేయించానని తెలిపారు. తక్షణమే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బిల్లులు రాక సర్పంచ్ ఆవేదన


