హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ బస్సు బోల్తా

ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం రోడ్డు సమీపంలో అనంతలక్ష్మి స్కూల్ బస్సు బోల్తా పడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 25 మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నాయి.