హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ

PLD: నరసరావుపేట పట్టణంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గురువారం లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.