హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాదంపూడిలో తాగునీటికి క్లోరినేషన్ చర్య

ELR: ఉంగుటూరు మండలం బాదంపూడిలో గురువారం తాగునీటి ట్యాంకులకు క్లోరినేషన్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో నీరు కలుషితం కాకుండా బ్లీచింగ్‌తో శుద్ధి చేసి క్లోరిన్ వేశామని పంచాయతీ కార్యదర్శి కె.వి.గిరిధర్ తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సురక్షిత నీటి సరఫరాపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. అలాగే గ్రామాలను డ్రైనేజీ పూడిక తీస్తున్నామన్నారు.