హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి.కొత్తకోట సీఐగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య: బి.కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ గురువారం బాధ్యతలు చేపట్టారు. మదనపల్లి తాలూకా సీఐగా పనిచేస్తున్న ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా బి.కొత్తకోటకు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ గోపాల్ రెడ్డి మదనపల్లి టూ టౌన్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.