హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

అన్నమయ్య: బి.కొత్తకోట నాయనబావి సమీపంలో యువరైతు గోపాల్‌రెడ్డి హత్య కేసులో ఆయన భార్య ప్రతిభను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, కుమారుడు తరుణ్‌కుమార్‌తో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 20న పొలంలో గోపాల్‌రెడ్డిని బండరాయితో కొట్టి హత్య చెశారు.