హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనంలో అపశృతి.. యువకుడు గల్లంతు

MDK: మసాయిపేట మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గణేష్ (35) అనే యువకుడు ప్రమాదవశాత్తు హల్దీ వాగులోని ప్రమాదకర నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గజఈతగాళ్ల సహాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.